ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. ఓ సీఐ, దళిత యువకున్ని బూటుకాలితో తన్నిన అమానుష ఘటన శ్రీ కాకుళం జిల్లాలోని పలాసలో చోటుచేసుకుంది. ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ అనే దళితుడిపై సీఐ కాలుజేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైఎస్ జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేశారు.
.@ysjagan గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు.అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేసారు.ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు.(1/3) pic.twitter.com/rYOh9YkwXI
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 5, 2020
ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్‌పై దాడికి దిగారు’ అని లోకేశ్ విమర్శించారు. వైసీపీ నాయకుల్లాగే ప్రజలని హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై సీరియస్ అయిన ఏపీ డీజీపి.. దళిత యువకుడిని బూటు కాలితో తన్నినందుకు సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.