వాస్తు: నరకచతుర్దశి నాడు ఇలా అనారోగ్య సమస్యలకి, ఆర్ధిక సమస్యలకి చెక్ పెట్టేయండి..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తుని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది. అలానే ఏమైనా ఆర్ధిక ఇబ్బందులు వున్నా కూడా ఇలా చెయ్యండి. దీనితో మీరు సమస్యలా నుండి దూరంగా ఉండచ్చు. ఆనందాన్ని కూడా పొందొచ్చు.

ఇంటి ముఖద్వారం దగ్గర ఇలా చేయండి:

ఇంటి ముఖద్వారం దగ్గర ఇలా చేస్తే ఇబ్బందులు వుండవు. కొద్దిగా పటికను తీసుకుని ఎర్రని గుడ్డలో దాన్ని కట్టండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యి పాజిటివిటీ కలుగుతుంది పైగా ఏ చెడ్డ కళ్ళు కూడా మీ ఇంటి మీద పడవు.

అనారోగ్య సమస్యలు వస్తే ఇలా చేయండి:

ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లైతే పటిక తో పాటుగా కొన్ని లవంగాలను తీసుకొని ఇంటికి కట్టండి. ఇలా చేయడం వల్ల సమస్యలు పోతాయి. లేదంటే పటికను అనారోగ్య సమస్యతో బాధపడే వ్యక్తి వద్ద పెట్టండి ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చేసి నెగిటివిటీని దూరం చేస్తుంది.

ఆర్థిక ఇబ్బందులు:

ఆర్థిక ఇబ్బందులతో కనుక సతమతమౌతుంటే ఒక వెండి గిన్నెలో పటికని పెట్టి అందులో మందార పువ్వుని పెట్టండి ఇలా ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

వాస్తు దోషాలు ఇలా తొలగించండి:
వాస్తు దోషాలు తొలగి పోవాలంటే నరకచతుర్దశి నాడు పటిక తీసుకుని ఇంట్లో ఉండే నాలుగు దిక్కుల్లో పెట్టండి ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే సమస్యలే ఉండవు.

 

Read more RELATED
Recommended to you

Latest news