విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

-

తెలంగాణలో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశం కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎమ్‌సెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కార్యాలయంలో మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు.

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు. మే 7వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్‌- ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎడ్‌సెట్‌ను మే 18న, ఈసెట్‌ను మే 20న, లాసెట్‌(ఎల్‌ఎల్‌బీ) మే 20న, మే 20న పీజీఎల్‌ సెట్‌ (ఎల్‌ఎల్‌ఎం), మే 26 నుంచి 27 వరకు పీజీ ఐసెట్‌, మే, 29 నుంచి జూన్‌ ఒకటి వరకు పీజీ ఈసెట్‌ను జరుగనున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్‌ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news