ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని నరేంద్ర మోడీ తగ్గించారు : మన్మోహన్ సింగ్

-

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ద్వేషపూరిత, అన్‌పార్లమెంటరీ ప్రసంగాలు చేయడం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని నరేంద్ర మోడీ తగ్గించారని ఆరోపించారు. ఏప్రిల్‌లో రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు.

జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ ప్రజలకు లేఖను రాశారు మన్మోహన్ సింగ్. అందులో నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై అయన విమర్శలు చేశారు. ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలని అన్నారు. మోదీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయిందని అన్నారు. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. రైతులను ప్రధాని మోదీ అవమానించారని మన్మోహన్ సింగ్ ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news