Ayodhya : జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి హోటల్ గదులకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. బుకింగ్స్ ఒక్కసారిగా పెరగడంతో గదుల రేట్లు కొన్నిచోట్ల రూ. లక్షకు చేరింది.
ఇటు వారణాసిలోనూ అదే పరిస్థితి నెలకొంది. మార్చి తర్వాతే కొత్త బుకింగ్స్ సాధ్యమవుతాయని అంటున్నారు. మరోవైపు భద్రతా కారణాలతో హోటల్స్ బుకింగ్స్ ను అధికారులు రద్దు చేస్తున్నారు. కాగా,అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రస్ట్ నిర్వాహకులు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపారు.
అయితే అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతి ష్ఠాపన కు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు తెలిపారు. 84 సెకన్లపాటు శుభ గడియలు ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగి పోతుందని జ్యోతిషులు వెల్లడించారు.