కాలుష్యంతో ఏటా 24 లక్షల మంది చనిపోతున్నారట..!

-

పొల్యూషన్ ఈరోజుల్లో ఎంత రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. దీని వల్ల సంభవించే మరణాలలో ఇండియా, చైనానే అగ్రస్థానంలో ఉన్నాయి. కేవలం ఇండియాలోనే.. కాలుష్యం కారణంగా.. ప్రతి సంవత్సరం.. 24 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ది లాన్సెట్ లో ప్రచురించిన అధ్యయనం చెబుతుంది. ఇంకా అధ్యయనంలో ఏం తేలిందంట..!
చైనాలో కాలుష్యం వల్ల.. 22 లక్షలు పైగా చనిపోతున్నారు. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 9 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అదే సమయంలో 2000 సంవత్సరం తర్వాత కార్లు, ట్రక్కులు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ కారణంగా మరణాలు దాదాపు 55 శాతం పెరిగాయట. అయితే కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ, జంతువుల వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం కారణంగా తక్కువ మరణాలు నమోదయ్యాయి.

గాలిలో తగ్గిన నాణ్యత..

భారతదేశంలో చాలా నగరాల్లో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. గత మార్చి-ఏప్రిల్ లో జాతీయ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201 నుంచి 215 వరకు ఉంది. 201 నుంచి 300 మధ్య ఉన్న AQI చాలా చెడ్డ స్థాయిగా పరిగణిస్తారు. మనం ఈ గాలిని ఎక్కువసేపు పీల్చుకుంటే శరీరం లోపల అన్ని రకాల దుష్ప్రభావాలు సంభవిస్తాయి. కానీ అది జరగడానికి చాలా సమయం పడుతుంది. నిరంతరం చెడు గాలి పీల్చడం వల్ల క్యాన్సర్, గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే వ్యాధులు, వాయు కాలుష్యం మధ్య సంబంధాలపై మరిన్ని అధ్యయనాలు చేయడం అవసరం ఉంది.
ఇప్పటికే చాలా నగరాల్లో.. కాలుష్యం తగ్గించడానికి వారంలో ఒక్కసారి అయినా.. సైకిల్ మీద ప్రయాణం చేయాలని సూచిస్తున్నాయి. కంపెనీలు కూడా.. ఆఫీస్ కు కొంచెం దగ్గర్లో.. సైకిల్ మీద వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాయి. వాయి కాలుష్యం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా అవసరం లేనప్పుడు వాహనాలు వాడకం తగ్గించాలి. సైకిలింగ్ చేయడం వల్ల కాలుష్యం తగ్గించవచ్చు.. ఆరోగ్యానికి కూడా మంచిది.!

Read more RELATED
Recommended to you

Latest news