ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి చిక్కుల నుండి బయట పడేదెప్పుడో…నిజంగా ఈ మహమ్మారి వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే ఇంకా కరోనా కేసులు తగ్గలేదు. చాలా మంది మహమ్మారి వలన సతమతమవుతున్నారు. వేలల్లో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే, కరోనా మహమ్మారి ఇంకా తగ్గక ముందే, తెరపైకి 48 వేల ఏళ్ల కిందటి జాంబియా వైరస్ వచ్చింది.
ఈ విజృంభిస్తే ప్రపంచే నాశనమేనని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో జాంబీ వైరస్ కలకలం రేపుతోంది. 48,500 సంవత్సరాల క్రితం నాటి వైరస్ ఇప్పుడు బహిర్గతం అయింది. రష్యాలోని గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సులో బయటపడింది జాంబీ వైరస్. ఈ వైరస్‌ను ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాండోరా వైరస్ ఎడోమాగా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. రష్యాలోని యుకేచి అలాస్ సరస్సులో గడ్డకట్టుకుపోయిన మంచులో బయటపడ్డ సైబీరియన్ తోడేలు పేగుల్లో జాంబీ వైరస్‌ను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్‌కు శరవేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నట్టుగా గుర్తించారు. ఇది బయటపడితే ప్రపంచ జనాభా ఆరోగ్యం మొత్తం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.