DJ శబ్దానికి గుండెపోటుతో బాలుడు మృతి

-

ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరిలోనూ గుండెపోటు వస్తోంది. జీవనశైలిలో మార్పులు.. తీసుకుంటున్న ఆహారం వల్ల ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అప్పటి దాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు.

అయితే.. తాజాగా DJ శబ్దానికి గుండెపోటుతో బాలుడు మృతి చెందారు.యూపీలో ఓ పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. డాన్స్ చేస్తూ 15 ఏళ్ల బాలుడు మరణించాడు. తన సోదరుడి వివాహ వేడుకలో సుధీర్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. డీజే శబ్దానికే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version