కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలబురిగి జిల్లా కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. జీపును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.