మీ కోసం మేము నిలబడతాం: ముందుకు వచ్చిన అమెరికా

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీగా పెరగడం వల్ల అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని, భారత ప్రభుత్వానికి, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు అదనపు సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నామని వైట్ హౌస్ ప్రకటించింది. తాము అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని, త్వరలోనే తాము భారత్ కు అండగా నిలుస్తామని చెప్పింది. సమయం చాలా తక్కువగా ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.

వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు, జేక్ సుల్లివన్ మాట్లాడుతూ… వెంటనే భారత్ కు సహాయం చేయడానికి గడియారంతో పాటు పని చేస్తున్నామని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,49,691 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 2,767 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.