భారత్ బయోటెక్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నామని ఆ సంస్థ వెల్లడించిది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరూ కూడా టీకాలు తీసుకున్నారని తెలిపారు. దీంతో ప్రస్తుతం టీకాలకు డిమాండ్ తగ్గిపోయిందని అన్నారు.
ఈ పరిస్థితిని తాము ముందే అంచనా వేసినట్టు తెలిపారు. అందు చేతనే కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నామని తెలిపారు. కొవాగ్జిన్ టీకాను ప్రపంచ దేశాలకు కూడా పంపిణీ చేశామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర వినియోగం జాబితా లో కొవాగ్జిన్ కూడా ఉందని గుర్తు చేశారు.
అలాగే ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తమ సంస్థలో తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిందని అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను తాము పాటిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ.. నూతన సాంకేతికత అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్టు తెలిపారు.