ఈరోజు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబడుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి అధికారంలో ఉన్న బీజేపీ ముందంజలో ఉంది.

బీజేపి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అనేది ఖరారైన నేపథ్యంలో అక్కడి నాయకులు ప్రభుత్వం ఏర్పాటు గురించి ఇప్పటికే కేంద్ర బీజేపీ నేతలతో సమావేశం జరపబోతున్నారు.

తాజాగా వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మరోసారి ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయబోతున్నారు అని వచ్చింది. బీరేన్ పనితీరు మీద భాజపా అగ్రనాయకత్వం సానుకూలంగా ఉందని కాబట్టి మరోసారి ఆయకే ముఖ్యమంత్రిగా ఇవ్వబోతున్నారు అని సమాచారం.