కేజ్రీవాల్ హత్యకు బిజెపి కుట్ర చేస్తోంది – మనీష్ సిసోడియా

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బిజెపి కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. గుజరాత్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే బిజెపి ఇదంతా చేస్తుందని.. దీని వెనక ఆ పార్టీ ఎంపీ మనోజ్ తివారి హస్తం ఉందని పేర్కొన్నారు. ఇలా బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదని మనీష్ సిసోడియా స్పష్టం చేశారు.

కేజ్రీవాల్ పై అటాక్ చేయమని మనోజ్ తివారి బహిరంగంగానే గుండాలకు చెబుతున్నారని.. దీనిపై ఇప్పటికే వారి స్కెచ్ వేసుకున్నట్లు ట్వీట్ చేశారు మనీష్ సిసోడియా. ఆయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ భద్రత గురించి ఆందోళనగా ఉందంటూ శుక్రవారం మనోజ్ తివారి ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణలు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎలక్షన్స్ లో టికెట్లు అమ్ముకోవడం గురించి ప్రస్తావించిన ఆయన ఈ కామెంట్ చేశారు. మనోజ్ తివారి చేసిన ఈ ట్వీట్ పై స్పందించిన సిసోడియ ఈ వ్యాఖ్యలు చేశారు.