ఇదేందిదీ : వాయిస్ టెస్ట్ చేసి కరోనా ఉందో లేదో చెప్పేస్తారట !

-

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా నమోదవుతున్నాయి. ఒకరకంగా ఇన్ని కేసులు నమోదు కావడానికి టెస్ట్ లు వీలయినన్ని ఎక్కువ సంఖ్యలో చేయకపోవడం అని చెప్పచ్చు. లక్షణాలున్నా టెస్ట్ లు సరిపడినన్ని చేయలేక పోవడంతో కరోన విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఇక దేశంలో కరోనాతో ముందున్న రాష్ట్రం ఏదయినా ఉందంటే అది మహారాష్ట్రనే. మరీ ముఖ్యంగా ముంబైలో ఈ వైరస్ వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంది. కరోనా వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ స్థాయికి చేరిందని భావిస్తున్న నేపథ్యంలో, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

ముంబయి అడిషనల్ మునిసిపల్ కమిషనర్ సురేష్ కాకాని ఈ మేరకు వివరాలు మీడియాకి అందచేశారు. మామూలుగా కరోనా వైరస్ ను గుర్తించేందుకు ఇప్పటివరకు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఓ వ్యక్తి వాయిస్ టెస్ట్ చేసి అతడికి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు. కరోనా అనుమానితుల వాయిస్ ని సాంకేతిక పరిజ్ఞానంతో అనలైజ్ చేసి ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి వైరస్ ఉందొ లేదో చెప్పేస్తుందట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ముందుగా వేయి మందిని టెస్ట్ చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ సిద్దం చేసినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news