ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో బాంబు కలకలం రేపింది. సీఎం ఇంటి వద్ద బాంబు ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగలోకి దిగిన లఖ్‌నవూ పోలీసులు యోగి ఇంటి సమీపంలో భద్రతను పటిష్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
గంటల పాటు వెతికినా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. బాంబ్ లేకపోవడంతో ఊరిపీల్చుకున్న పోలీసులు.. ఎవరో కావాలనే ఫేక్ కాల్ చేసి ఉంటారని భావించారు. కాళీదాస్ మార్గ్‌లోని సీఎం యోగి ఇంటి వద్ద బాంబు ఉందని తమకు సమాచారం వచ్చిందని లఖ్‌నవూ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని ఆయన వెల్లడించారు.
సీఎం యోగికి ఇలాంటి బెదిరింపులు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇంతకుముందు ఆదిత్యనాథ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తానని ట్విటర్లో బెదిరించాడు. యోగి భద్రతా సిబ్బందిని కూడా బాంబు పెట్టి చంపేస్తామని హెచ్చరించాడు.