ధోని బ్యాటింగ్‌ పై బ్రావో సంచలన వ్యాఖ్యలు

ఐపీల్ అంటే ముందుగా గుర్తొచ్చేది సి ఎస్ కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఐపీల్ లో టాప్ ప్లేస్ లో ఉండేది కూడా సి ఎస్ కే. ధోని తన క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. ధోని తన బ్యాటింగ్ పెరఫామెన్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. విదేశీ ఆటగాళ్లలో సైతం ధోనికి అభిమానులు ఉన్నారు.

 

 

 

అటువంటి ధోని సారధ్యం లో ఇప్పటి వరకు జరిగిన ఐపీల్ టోర్నమెంట్ లలో చెన్నై మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచజి గా పేరు తెచ్చుకుంది.చెన్నై తో మ్యాచ్ అంటే అది లీగ్ ఫస్ట్ మ్యాచ్ అయినా లాస్ట్ మ్యాచ్ అయినా ఒకేలా ఉంటాయి. చెన్నై మైదానంలో ఉంది అంటే ప్రేక్షకులు సీట్ అంచుల్లో కూర్చోవడం పక్కా. అంతేకాకుండా ఇతర జట్టు సైతం చెన్నై తో మ్యాచ్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎలాగైనా గెలవాలి అని కసి తో ఆడుతాయి. అయితే తాజాగా చెన్నై ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో తన ప్రాంచేసి సక్సెస్ గురించి హాట్ కామెంట్ చేసాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సి ఎస్ కే) సక్సెస్ కు తమ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారు. “ధోని కెప్టెన్ అద్భుతంగా రాణించాడు. అతడు ఇంకా ఆడుతుండటం చాలా ఆనందకరమైన విషయం” అని అన్నాడు. అంతేకాకుండా ధోని నాలుగు ఐపీల్ టైటిల్స్ అందించాడు. ధోని గురువారం కెప్టెన్సీ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజా జట్టు సారథ్యం అందుకున్నాడని చెప్పుకొచ్చాడు బ్రావో…