జూన్ నెల వస్తు వస్తూనే తీపికబురు తీసుకువచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేశాయి. జూన్ 1 నుంచి సిలిండర్ ధరల తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చింది. అయితే ఇక్కడ గ్యాస్ ధరల తగ్గింపు కేవలం 19 కేజీల గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిందని చెప్పుకోవాలి. ఈరోజు నుంచి 19 కేజీల సిలిండర్ రేటు రూ. 135 మేర దిగివచ్చింది.
ఢిల్లీలో ఇదివరకు ఈ సిలిండర్ ధర రూ .2354 గా ఉండేది. ఇప్పుడు రూ. 2219 కి లభిస్తుంది. హైదరాబాద్ లో సిలిండర్ రేటు రూ. 2425 గా ఉంది. కాగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏప్రిల్ నెలలో ఏకంగా రూ .250 మేర పెరిగింది. అలాగే మార్చి నెలలో రూ .105 మేర పైకి కదిలింది. అయితే డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కాగా గత నెలలోనే ఎల్పిజి సిలిండర్ ధరలు రెండుసార్లు పెరగడం గమనార్హం.