దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు

-

దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటల పాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో స్పిరిట్‌ గ్రూప్‌ ఎండీతో పిళ్లైకి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ అభియోగం.

ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న తెలుగు ఐఏఎస్‌ అధికారి గోపీకృష్ణ ఇంట్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గోపీకృష్ణ దిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 31చోట్ల సీబీఐ దాడులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news