ఇక బంగారం, వెండి, ఫోన్లు చౌక.. మరి ధరలు పెరిగే వస్తువులు ఏవంటే?

-

కేంద్ర బడ్జెట్ 2024లో బంగారం, వెండి, మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో లెదర్‌ వస్తువులు, సీఫుడ్స్ కూడా చౌకగా లభించనున్నాయి. మరోవైపు మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర మొబైల్‌ విడిభాగాల ధరలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయో ఓసారి చూద్దామా..?

ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..

బంగారం, వెండి లోహాలపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు.

ప్లాటినమ్పై 6.4 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది.

మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్పై 15 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.

నిర్మలా సీతారామన్ 25 కీలక ఖనిజాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు.

ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించారు.

రొయ్యల, చేపల మేతపై, బ్రూడ్ స్టాక్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించారు.

వీటిపై కస్టమ్స్ సుంకాలు పెరిగాయ్

టెలికాం పరికరాలపై మాత్రం కస్టమ్స్ సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.

అమోనియం నైట్రేట్పై 10 శాతం, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై 25 శాతం కస్టమ్స్ సుంకం పెంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version