భారత్‌లో కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. మొన్నటిదాక సైలెంట్‌గా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
ఇటీవల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. నిన్న 42మరణాలు నమోయ్యాయి. అందులో కేరళ నుంచే 10 మరణాలు రికార్డు కాగా.. అవి సవరించిన గణాంకాలుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ‘కొవిడ్ మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. వైరస్ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.