ఈ పది రాష్ట్రాల్లోనే 74.53 శాతం కోవిడ్ కేసులు

-

దేశంలో కరోనా కోరలు చాస్తుంది. చాప కింద నీరులా ప్రవహించి ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చి ఒక్కసారిగా దేశాన్ని ఆందోళనలోకి నెట్టేసింది. శనివారం రోజున 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 26,82,751కు చేరింది.

అయితే శనివారం నమోదైన కేసుల దృష్ట్యా కరోనా తీవ్రత పది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ ఈ పది రాష్ట్రాల్లో కరోనా 74.53 శాతం కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.దేశంలో కోవిడ్ తీవ్రత పెరుగుతుండడంతో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు వేగవంతం చేసాయి. ఇప్పటికే ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కేంద్రం ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటుంది. దేశవ్యాప్తంగా 551 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్స్ నిధులను వినియోగించనుంది.

అలానే అటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్రం వేగవంతం చేస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్ళ పైబడిన వారికి కూడా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఏప్రిల్ 28 నుంచి రిజిష్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక దేశంలో ఇప్పటివరకు టీకాలు పొందిన వారి సంఖ్య 14,09,16,417 కి చేరింది. అటు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల లాక్ డౌన్ పొడగిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news