ఇండియాలో కొత్తగా 104 కరోనా కేసులు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 104 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,81,040 కు చేరింది.

 

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,149 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా ఒక్కరు కూడా మరణించలేదు. దీంతో మృతుల సంఖ్య 5,30,726 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 182 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,48,165 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,17,02,033 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 7891 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.