తన జీతం ఎంతో చెప్పేసిన క్రెడ్‌ సీఈవో కునాల్ షా

-

కార్పొరేట్ బాస్ ల జీతం ఎంత ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. కానీ అది నిగూఢ రహస్యంగా ఉంచుతారు. అయితే సీఈవోల జీతం మాత్రం కోట్లలో ఉంటుందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ తాజాగా భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈఓ కునాల్ షా మాత్రం నెలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

కునాల్‌ షా.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు. ఈ చర్చ సందర్భంగా నెటిజన్లు ఆయన్ని పలు ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఓ యూజర్‌ ‘క్రెడ్‌లో తక్కువ శాలరీ తీసుకుంటూ ఎలా నెట్టుకొస్తున్నారు..?’ అని ప్రశ్నించాడు. దీనికి కునాల్‌ స్పందిస్తూ.. ‘నా శాలరీ నెలకు రూ.15 వేలే. అయితే.. కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను భారీ స్థాయిలో జీతభత్యాలు తీసుకోవడం సబబు కాదని అనుకుంటున్నాను. గతంలో నా కంపెనీ ఫ్రీఛార్జ్‌ను అమ్మేయగా వచ్చిన డబ్బు నాకు సరిపోతోంది’ అంటూ సమాధానమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version