కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 6 శాతం పెరగనుందా?

-

కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపు కోసం ప్రభుత్వంతో పోరాడిన సంగతి తెలిసిందే..చివరకు ప్రభుత్వం జీతాల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల డీఏ పెరగనుందని ఎదురు చూస్తున్నారు..సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది. జూలై 1న డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం AICP ఇండెక్స్ ప్రకారం డీఏ పెంచుతుంది. AICP ఇండెక్స్ డేటాను పరిగణలోకి తీసుకొని ఎంత డీఏ పెంచాలో నిర్ణయిస్తుంది. ఉద్యోగులకు ఈ ఏడాది జనవరికి సంబంధించిన డీఏ 3 శాతం పెరిగింది. దాంతో డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. అంతకుముందు కూడా డీఏ 3 శాతం పెరిగింది. అంతకన్నా ముందు 18 నెలలకు సంబంధించిన డీఏ ఒకేసారి 11 శాతం పెరిగింది.
డీఏ 3 శాతం లేదా 4 శాతం పెరుగుతుందని అంచనా. ఈసారి డీఏ 4 శాతం పెరిగితే ఉద్యోగులకు 38 శాతం డీఏ లభించనుంది.

అయితే ఈసారి అంతకన్నా ఎక్కువ డీఏ పెరగొచ్చన్న వార్తలొస్తున్నాయి. 5 శాతం లేదా 6 శాతం డీఏ పెరగొచ్చని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగులకు 40 శాతం డీఏ లభిస్తుంది. 2022 ఏప్రిల్‌లో 1.7 పాయింట్స్ పెరిగి 127.7 పాయింట్స్‌కి చేరుకుంది. మేలో 129 పాయింట్స్‌కి చేరుకుంది. ఈ డేటా ప్రకారం డీఏ 6 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతోంది..

కాగా, ఉద్యోగులకు మొత్తం డీఏ 18 నెలలది పెండింగ్ లో ఉంది.2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు డీఏ బకాయిలు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం డీఏ బకాయిల్ని ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డీఏ బకాయిల్ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో కాకుండా సింగిల్ సెటిల్మెంట్‌లో రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు గతంలో చాలా సార్లు వార్తలు వినిపించాయి.డీఏ బకాయిల్ని ఒకేసారి విడుదల చేస్తే ఉద్యోగులకు గరిష్టంగా రూ.2,18,200 వరకు బకాయిలు రావొచ్చు. లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 మధ్య, లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు అందుతాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...