ఈ నెల 17 నుంచి ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

-

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సీబీఐ మనీష్‌ సిసోడియా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 17 నుంచి ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొన్నటి వరకు ఆర్థికశాఖతో పాటు దాదాపు 18 శాఖల బాధ్యతలను మనీష్‌ సిసోడియా చూసుకునే వారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన కేబినెట్‌ పదవికి రాజీనామా చేశారు.

Delhi budget session to begin on March 17 Kailash Gehlot to present Budget  Latest Update News in Hindi, Latest News in Hindi Newstrack Samachar | Delhi  Assembly Budget Session: दिल्ली विधानसभा का

ఈ క్రమంలో ఆయన స్థానంలో మంత్రిగా కొనసాగుతున్న కైలాశ్‌ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆర్థికశాఖ పగ్గాలను అప్పగించారు. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండగా.. కైలాశ్‌ గెహ్లాట్‌ ఈ నెల 21న అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన.. పలుసార్లు బడ్జెట్‌పై అధికారులతో సమావేశాలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news