షారుఖ్‌ ఖాన్‌ వన్‌ మ్యాన్ షో పఠాన్‌ సినిమాకి 2.05 కోట్లు వసూళ్లు

-

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రం మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఒక అప్‌డేట్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. పఠాన్‌ విడుదలైన తర్వాత హిందీలో కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన షెహ్‌జాదా, అక్షయ్‌ కుమార్ నటించిన సెల్ఫీ సినిమాలు విడుదలయ్యాయి.

Shah Rukh Khan's Pathaan enters Rs 100-crore club on Day 1 at global box  office. Read details - India Today

అయితే ఈ రెండు రీమేక్‌ సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయలేకపోవడంతో.. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ టాక్‌ మూటగట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలు విడుదలైన కొన్ని రోజుల్లోనే థ్రియాట్రికల్‌ రన్‌ ముగిసే వరకు వచ్చిందంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది మాత్రం పఠాన్‌కు బాగా కలిసొచ్చింది. షారుఖ్‌ ఖాన్‌ వన్‌ మ్యాన్‌ షోలా ఆరవ వీకెండ్‌లోనూ తన హవా కొనసాగిస్తున్నాడు. తాజా ట్రేడ్ సర్కిల్ టాక్‌ ప్రకారం శనివారం పఠాన్‌ 2.05 కోట్లు వసూళ్లు చేసింది. ఇవి శుక్రవారం కలెక్షన్లతో పోలిస్తే రెట్టింపు కావడం విశేషం.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news