ఉపరాష్ట్రపతి వెంకయ్యని కలిసిన పింగళి వెంకయ్య వారసులు

-

భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి వారసులు ఉపరాష్ట్రపతి నివాసంలో, గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కలిశారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారితో కలిసి ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన వారిని ఉపరాష్ట్రపతి గారు శాలువతో సత్కరించారు. భారతదేశ ప్రజల విజయధ్వజమైన, భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారు తెలుగు ప్రజలకు గర్వకారణమని తెలిపారు.

భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైనదని తెలిపారు. వారి కార్యదీక్ష, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్రీమతి పింగళి సుశీల దశరథ రామన్, శ్రీ పింగళి వెంకయ్య దశరథ రామన్ (ముని మనుమడు), శ్రీ ఘంటసాల గోపీకృష్ణ, శ్రీ ఘంటసాల వాసుదేవ నరసింహన్, శ్రీ ఘంటసాల కృష్ణ ప్రవీణ్ తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news