లిక్కర్ స్కామ్​లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

-

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలతో మరికొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కేసు ఉచ్చు దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చుట్టూ బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్​షీట్లలో కేజ్రీవాల్ పేరు అనేకసార్లు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు కేజ్రీవాల్​తో నిరంతరం టచ్​లో ఉన్నారని ఈడీ పేర్కొంది.

ఇక ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్​ను విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్​కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆప్ మంత్రులు ఈ కేసులో అరెస్టైన నేపథ్యంలో.. తాజాగా కేజ్రీవాల్​కు నోటీసులు పంపడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు కేజ్రీవాల్​కు సమన్లు పంపించడంపై ఆప్ తీవ్రంగా ఫైర్ అయింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version