త్వరలో దేశంలో రైతు తుఫాన్ రాబోతుంది.. దాన్నెవరూ ఆపలేరు – సీఎం కేసీఆర్

త్వరలో దేశంలో రైతు తుఫాను రాబోతుందని.. దాన్ని ఎవరు ఆపలేరని అన్నారు సీఎం కేసీఆర్. నేడు మహారాష్ట్రలోని కాందార్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని అన్నారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరాకి 10000 ఇచ్చే వరకు కొట్లాడతామన్నారు. మన కళ్ళ ముందే నీరు సముద్రంలో కలిసిపోతుందని.. పాలకులు మారిన ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదన్నారు.

125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చే అంత బొగ్గు మన దగ్గర ఉందన్నారు సీఎం కేసీఆర్. అయినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రను తెలంగాణ తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మహారాష్ట్రలోనే కృష్ణ, గోదావరి నదులు పుట్టిన ఇక్కడి రైతులకు ఎందుకు మేలు జరగడం లేదన్నారు. తనతో కలిసి యుద్ధం చేస్తే నీళ్లు, కరెంట్ వస్తాయని అక్కడి ప్రజలతో అన్నారు సీఎం కేసీఆర్. త్వరలో మహారాష్ట్రలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికలలో బిఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు.