డిగ్రీ ప్యాస్ అయిన వాళ్లకి గుడ్ న్యూస్.. LIC లో 9394 ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ ని రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశవ్యాప్తంగా 9394 అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ADO) పోస్టులే ఇవి.

అలానే సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ లో 1408 పోస్టులు వున్నాయి. ఇక ఎవరు ఈ పోస్టులకి అర్హులు అన్నది చూస్తే.. అభ్యర్థుల వయసు 21-30 ఏళ్ల మధ్య వుంది తీరాలి. అలానే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 10. కనుక ఈలోగా మీరు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం https://licindia.in/ లో ని చూడచ్చు.

అలానే ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (జనరలిస్ట్‌) పోస్టులు వున్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ ప్యాస్ అయినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

ఈ పోస్టులకి అయితే 01.01.2023 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి. రూ.53,600-రూ.1,02,090 సాలరీ ఇస్తారు. ఈ పోస్టుల కోసం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ లో మెరిట్‌ చూసి ఎంపిక చేస్తారు. జనవరి 31, 2023 లోగా అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://licindia.in/ ని సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news