నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్బీఐలో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి చెందిన సర్వీసెస్ బోర్డ్ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 303 ఖాళీలు వున్నాయి. తాజాగా ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది.

దరఖాస్తులకు 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. కనుక ఆసక్తి, అర్హత ఉంటే ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మొత్తం ఖాళీలు 303 ఖాళీలు వున్నాయి అని నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. గ్రేడ్ బి ఆఫీసర్లు (ఎకనామిక్ అండ్ పాలసీ రిసెర్చ్ విభాగం-DEPR) 31, గ్రేడ్ బి ఆఫీసర్లు (స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగం-DSIM) 25, అసిస్టెంట్ మేనేజర్లు (రాజ్ భాష) 6, అసిస్టెంట్ మేనేజర్లు (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) 03 వున్నాయి.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే… దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ విధానం లో పరీక్షని నిర్వహిస్తారు. దాని ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలను మే 28, జూన్ 25, జులై 2, ఆగస్టు 6, మే 1వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. విద్యార్హతల వివరాలను మీరు నోటిఫికేషన్ లో చూసి తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలను https://www.rbi.org.in/ లో చూసి తెలుసుకోవచ్చు. ఈ నెల 28 న పూర్తి వివరాలను అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news