ప్ర‌భుత్వ టీచ‌ర్లు ఇక ట్యూషన్లు చెబితే చ‌ర్యలే.. హై కోర్టు తీర్పు

-

ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు.. ప్ర‌యివేటుగా ట్యూషన్లు చెబితే.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌ద్రాస్ హై కోర్టు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ.. అక్క‌డే ప్రయివేటుగా ట్యూషన్లు చెబుతూ.. వ్యాపారం చేసుకుంటున్నార‌ని మ‌ద్రాస్ హై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వానికి హై కోర్టు ఆదేశాల‌ను జారీ చేసింది. అంతే కాకుండా.. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేయాల‌ని కూడా ఆదేశించింది.

ఇలాంటి కేసును విచారించిన ధ‌ర్మాస‌నం.. ప్రయివేటు ట్యూషన్లు చెప్పె ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న చ‌ట్ట విరుద్ధ కార్య‌క‌లాపాల తో పాటు అవ‌క‌త‌వ‌క‌ల గురించి ఫిర్యాదు చేయ‌డానికి ప్ర‌త్యేక ఫోన్ నెంబ‌ర్ ను కూడా ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌ని సూచించింది. అలాగే ప్ర‌భుత్వ టీచర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాల‌ని కూడా ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news