గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రేమ వివాహాలకు తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి !

-

ప్రేమ వివాహాలపై గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది గుజరాత్ ప్రభుత్వం. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.

రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గుజరాత్ ప్రభుత్వం పరిశీలిస్తున్న ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రేమించుకునే స్వేచ్ఛ లేకుండా చేస్తోందని గుజరాత్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. ప్రేమ వివాహాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని… తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు మన రాజ్యాంగం కల్పించిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version