చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనా నైరుతి భాగాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం దాటికి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ఇల్లు ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలలో బండరాళ్లు దొర్లి పడటంతో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. టెలి కమ్యూనికేషన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.6 గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
కాంగ్ డింగ్ నగరానికి నైరుతి దిక్కున 43 కిలోమీటర్ల దూరంలో, దాదాపు పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ భూ ప్రకంపనలు రాజధాని ప్రాంతమైన చగ్దు నగరంలో కూడా కనిపించాయి. ఈ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో భూకంపం సంభవించడంతో దాదాపు పదివేల మంది వరకు ప్రభావితులయ్యారని చైనా అధికారిక టీవీ వెల్లడించింది.