అరుదైన అవకాశం.. పీఎంఓలోకి ఆమ్రపాలి..!

ఆంధ్రప్రదేశ్ 2010 కేడర్‌కు చెందిన ఆమ్రపాలి కాట గతంలో తెలంగాణలో ఐఏఎస్ అధికారిణిగా పలు ప్రాంతాల్లో సేవలందించి, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా… ఆమెకు మరో అరుదైన అవకాశం లభించింది. ఆమె తాజాగా ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీగా నియమితులయ్యారు. తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ ‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. ఆమె 2023 అక్టోబర్ 27 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్, ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ కూడా ఉన్నారు. ఇకపోతే విశాఖలో పుట్టిన ఆమ్రపాలి.. చెన్నై ఐఐటీ నుంచి పట్టాపుచ్చుకున్నారు.. అనంతరం ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశారు.. ఆ తర్వాత 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ను సాధించి, తెలంగాణ కేడర్‌కు ఎంపికయ్యారు.