BREAKING : బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం.. షాక్ లో NRIలు

-

దేశీయంగా బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గురువారం నిషేధం విధించింది. రానున్న పండుగ సీజన్‌ దృష్ట్యా రిటైల్‌ ధరలను అదుపులో ఉంచటానికి, దేశీయంగా సరఫరాను పెంచటానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహారశాఖ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యంపై మాత్రమే నిషేధం విధించగా.. ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యం ఎగుమతుల విధానంలో ఎలాంటి మార్పు లేదు.

ఈ ప్రకటనతో.. ఎన్ఆర్ఐలు ఉలిక్కిపడ్డారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు బియ్యం కోసం రైస్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. బియ్యం ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. కొన్ని స్టోర్స్ ముందు ధరలు పెరిగినట్లు బోర్డులు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. అమెరికాలో బియ్యం కోసం NRIలు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్నిచోట్ల బియ్యం బస్తాల కోసం గొడవలు పడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందో తెలియదనే భయంతో అవసరానికి మించి కొందరు బియ్యం కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version