ఆకాశంలో విమానం… సెల్ ఫోన్ లో నుంచి మంటలు

-

పెను ప్రమాదం తప్పింది. గాలిలో విమానం ఉండగా ప్రయాణికుడి సెల్ ఫోన్ల నుంచి పొగలు, మంటలు రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అస్సాం దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం ఆకాశంలో ఉండగా ప్రయాణికుడి సెల్ ఫోన్ నుంచి పొగలు, మంటలు రావడాన్ని ఇతర ప్రయాణికులు గమనించారు. వెంటనే క్యాబిన్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పే యంత్రాల ద్వారా మంటల్ని ఆర్పేశారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇతర ప్రయాణికులకు కానీ, సిబ్బందికి కానీ ఎలాంటి హానీ జరగలేదు. విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. కాగా మొబైల్ ఫోన్ బ్యాటరీ వెడెక్కి ఇలా జరిగిందని… ఇలాంటి పరిణామాలు ఎదురైనప్పుడు ఏవిధంగా స్పందించాలనే దానిపై సిబ్బంది శిక్షణ తీసుకుని ఉంటారని అందువల్లే ప్రమాదం తప్పిందని ఇండిగో యాజమాన్యం తెలిపింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news