కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం వైఖరి నడుస్తోంది. యూనివర్సిటీ వీసీలను రాజీనామా చేయమని గవర్నర్ ఆదేశించడంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని పినరయి విజయన్ విమర్శించారు. ఆరిఫ్ ఖాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీల పనితీరును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ పదవి గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదని, రాజ్యాంగం హుందాతనాన్ని కాపాడడానికి అని సీఎం పినరయి హితవు పలికారు.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని విమర్శిస్తూ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆదివారం సంచలన ఆదేశాలు జారీచేశారు. కేరళలో అక్రమంగా నియమితులైన 9 యూనివర్సిటీలకు చెందిన వీసీలు తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆర్డర్ పాస్ చేశాడు. ఈ నేపథ్యంలోనే సీఎం పినరయి విజయన్ స్పందించారు. గవర్నర్ తీరుపై మండిపడ్డారు.