రాహుల్‌ వల్ల మేం ‘గాంధీ’ పేరున్న వారిని నిందించట్లేదు కదా : కిరణ్ రిజిజు

-

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వం తమకు ప్రత్యర్థులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ మోదీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాహుల్‌లాగా.. తాము కూడా గాంధీ ఇంటి పేరు ఉన్నవారందరి పైనా నిందలు వేయడం లేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

‘‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యలతో దేశ ప్రజాస్వామ్యాన్ని, సాయుధ దళాలను, దేశ సంస్థలను, ఓబీసీ కమ్యూటినినీ కించపరుస్తున్నారు. అలా అని మేం గాంధీ ఇంటిపేరు ఉన్న ప్రతి ఒక్కరిని నిందిచట్లేదు కదా. ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలుగుతోంది. అయినా ఆ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలవటం ఆశ్చర్యకరం’ అంటూ రిజిజు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news