మహారాష్ట్రను వణికిస్తున్న లంపీ వైరస్..ఇప్పటి వరకూ 126 పశువులు మృతి..

-

మహారాష్ట్రలో లంపీ వైరస్‌ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 126 పశువులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం 25 జిల్లాలో కేసులు నమోదయ్యాట. మొన్నటివరకూ రాజస్థాన్‌ను పీడించిన ఈ వైరస్‌ ఇప్పుడు మహారాష్ట్రకు వ్యాపించింది. వైరస్‌ భయంతో పశువుల కాపారులు బెంబేలెత్తుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని..?

మొత్తం 126 పశువులు చనిపోగా… జల్గాన్ జిల్లాలో 47, అహ్మద్‌నగర్ జిల్లాలో 21, ధులే- 2, అకోలా- 18, పూణే -14, లాతూర్‌లో 2, సతారా – 6, బుల్దానా – 5, అమరావతి – ఏడు ఉండగా సంగ్లీ, జల్నా, నాగ్ పూర్ జిల్లాల్లో ఒకటి మృత్యువాత పడ్డాయి.

లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) మహారాష్ట్ర రాష్ట్రమంతటా వేగంగా విస్తరిస్తోంది. అదేంటో మహారాష్ట్రలో ఏ వైరస్‌ అయినా వేగంగానే వ్యాపిస్తుంది. కరోనా కేసులు కూడా అప్పట్లో మహారాష్ట్రలోనే అధికంగా వచ్చేవి. ఇది పశువుల చర్మసంబంధమైన వైరల్ వ్యాధి అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి జంతువుల నుంచి లేదా ఆవు పాల ద్వారా మనుషులకు సంక్రమించదని స్పష్టం చేశారు. లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, జంతువుల నుంచి లేదా ఆవు పాల ద్వారా మానవులకు సంక్రమించదని పేర్కొంది.

మనుషులకు కూడా వ్యాపిస్తుందా..?

ఈ వైరస్‌పై అనవసరమైన పుకార్లు ప్రచారం చేయవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ వ్యాప్తి ఆవులు, ఎద్దులకే పరిమితం చేయబడిందని స్పష్టం చేసింది. మనుషులకు వస్తుందంటూ లేనిపోని ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. వ్యాధి చికిత్సకు అవసరమైన మందుల కొనుగోలు కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు అందుబాటులో ఉంచినట్లు పశుసంవర్థక శాఖ తెలిపింది. Maharashtra Animal and Fisheries Sciences University ఆధ్వర్యంలో టీకాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఈ వైరస్‌కు సంబంధించిన జంతువల్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పశుసంవర్థ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు వెల్లడించారు. ఇంటివద్ద పశువులకు చికిత్స అందించేలా చర్యలు చేపడుతామని రైతులకు తెలిపారు.

ఈ వైరస్‌ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాపించింది. గత నెలలో వచ్చిన నివేదిక ప్రకారం..ఈ వైరస్తో రాజస్థాన్‌లో 12వేల పశువులు మృత్యువాతపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news