మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా అస్వస్థతకు గురయ్యారు. మల్టీపుల్ స్క్లేరోసిస్ తో బాధపడుతున్న ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాధి వల్ల మెదడు – వెన్నెముక మధ్య వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది.
సిసోడియా కుమారుడు విదేశాలలో ఉన్నాడు. అందువల్ల తన భార్యను చూసుకోవలసి ఉందని, తనకి బెయిల్ ఇవ్వాలని ఆయన ఇప్పటికే కోర్టుకు పలుమార్లు విన్నవించుకున్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతని బెయిల్ ని వ్యతిరేకిస్తూ వస్తుంది సిబిఐ. అతను ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నాడని.. కేసుకు సంబంధించిన సాక్షాలను ప్రభావితం చేయగలడు అంటూ బెయిల్ నిరాకరిస్తుంది సిబిఐ.