కొత్త కారు కొన్న ముఖేష్‌ అంబానీ.. ధర ఎంతో తెలుసా?

ఇండియా లోనే అత్యంత ధనవంతుడు రిలయన్స పరిశ్రమ అధినేత ముఖేష్‌ అంబానీ. అయితే.. తాజాగా ముఖేష్‌ అంబానీ ఓ అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దీని విలువ ఎకంగా అక్షరాల రూ.13.144 కోట్లు. ఈ హ్యాచ్‌ బ్యాక్‌ కారు బ్రిటిష్‌ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌కు చెందింది.

ఈ కారును సౌత్‌ ముంబైలోని టార్డియో రీజినల్‌ ట్రాన్స్‌ పోర్టు ఆఫీస్‌ లో జనవరి 31 న కంపెనీ రిజిస్టర్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ కోసం ముఖేష్‌ అంబానీ ఏకంగా రూ.20 లక్షల పన్ను చెల్లించారు. ఈ పెట్రోల్‌ కారు దేశంలో ఇప్పటి వరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లల్లో ఒకటని అధికారులు చెబుతున్నారు.

ఇక ఈ కారు కోసం అంబానీ వీఐపీ నంబర్‌ కూడా తీసుకున్నారని.. ఈ నంబర్‌ 0001 తో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈ నెంబర్‌ కోసం అంబానీ రూ.12 లక్షలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ఈ కారును రోల్స్‌ రాయిస్‌ తొలిసారిగా 2018 లో విడుదల చేసింది.