రక్షా బంధన్‌ స్పెషల్.. ముస్లిం మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు

-

త్వరలో రక్షాబంధన్ పండుగ రాబోతోంది. ఈ నేపథ్యంలో ముస్లిం మహిళలకు స్పెషల్ కానుక ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎన్‌డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఎన్‌డీఏ ఎంపీలకు మోదీ సూచించారు. ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తూ తమ ప్రభుత్వం చట్టం తీసుకురావడం వల్ల ముస్లిం మహిళల్లో భద్రత భావన పెరిగిందని అన్నారు.

ఈ నెల 30న రక్షా బంధన్‌ పండుగ రోజు ముస్లిం మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. సోదరీ, సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా రక్షా బంధన్‌ పండగను నిర్వహిస్తారు. ఎన్‌డీఏ ఎంపీలతో వరుస భేటీల్లో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రాత్రి పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఝార్ఖండ్‌లకు చెందిన ఆ కూటమి ఎంపీలతో భేటీ అయ్యారు. హజ్‌ విధానంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల వల్ల మక్కా వెళ్లే ముస్లిం మహిళా యాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఇటీవల మన్‌ కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version