వెంకయ్య నాయుడుకు “పద్మ విభూషణ్”..నా బాధ్యతను పెంచిందంటూ ఎమోషనల్‌

-

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు “పద్మ విభూషణ్”..అవార్డు దక్కింది. ఈ మేరకు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. “పద్మ విభూషణ్”..అవార్డు రావడంపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎమోషనల్‌ అయ్యారు. ప్రజా జీవితంలో చేసిన సేవలకు గాను “పద్మ విభూషణ్” పురస్కారం భారత ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకమన్నారు.

Padma Vibhushan to Venkaiah Naidu

నవ భారతం నిర్మాణంలో భాగస్వాములౌతున్న ప్రతిఒక్కరికీ ఈ పురస్కారం అంకితమని వివరించారు. శక్తి వంతమైన ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని వెల్లడించారు. సమాజాన్ని ఉత్తేజపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని.. ఈ పురస్కారం నా బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version