అఖిల పక్ష సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. అలాగే.. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల తో సమావేశం జరుగనుంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిల పక్ష సమావేశం, ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలోనే నిన్న రాజనాధ్ నివాసంలో జరిగిన కీలక మంత్రుల సమావేశం జరుగనుంది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగే అఖిల పక్ష సమావేశంలో రాజనాధ్ సింగ్ తో పాటు పలువురు సీనియర్ మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. గతంలో పలు సార్లు హాజరైన ప్రధాని మోడీ, ఈ రోజు హాజరయ్యే అవకాశం అనుమానంగా ఉంది. వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. మణిపూర్ హింస, ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై చర్చకు పట్టుపట్టనున్నాయి ప్రతిపక్షాలు. చర్చ కోసం సమయం కేటాయించాలని అడగనున్నాయి ప్రతిపక్షాల నేతలు.