ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని విపక్షాలకు కూడా తెలుసు : ప్రధాని మోడీ

-

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందని.. ప్రతిపక్షాలకు కూడా తెలుసన్నారు ప్రధాని మోడీ. లోక్ సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన తమ ప్రభుత్వం.. దేశాభివృద్ధి కోసమే వాడిందన్నారు. కానీ, అంతకు ముందు కాంగ్రెస్ మాత్రం దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా.. దేశాభివృద్ధి కోసం పనిచేయలేదన్నారు. కేవలం ఓకుటుంబం కోసం మాత్రమే పనిచేసిందని విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రతిపక్షాలకు తెలుసని అన్నారు.

కేంద్ర ఏజెన్సీలను దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్న వార్తలను ఖండించారు. విపక్షాలు చేస్తున్నా ఆరోపణలపై మండిపడ్డారు. అవినీతి పరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న వార్తలు అవాస్తవం అన్నారు. కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతం వాటికే రాజకీయాలతో సంబంధం ఉందన్నారు. మిగతా 97 శాతం కేసులు అవినీతి అధికారులు, నేరస్థులకు సంబంధించినవే అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news