లోక్సభ మూడో దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

-

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండవేడిమికి భయపడి చాలా మంది ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంల్లోని 93 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను వివరించి.. ప్రజలంతా ఓటు వేయాలని కోరుతున్నారు.

గుజరాత్ గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చాక తాను తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చేతి వేలికి ఉన్న సిరా చుక్కను చూపించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్తోపాటు ఆయన సతీమణి, బారామతి లోక్సభ అభ్యర్థి సునేత్ర పవార్ ఓటేశారు. కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప, ఆయన కుమారులు విజయేంద్ర, రాఘవేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. మహారాష్ట్ర లాథోర్లో సినీ నటుడు రితేశ్ దేశ్ముఖ్, ఆయన సతీమణి జెనీలియాతో కలిసి వచ్చి ఓటు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version