కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ప్రియాంక గాంధీ !

-

కాసేపటి క్రితమే సి.డబ్ల్యు.సి సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆరు అంశాలపై సిఫార్సులతో కూడిన తీర్మానాల పై చర్చ, అలాగే ఆమోదం కూడా తెలపనుంది “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” ( సి.డబ్ల్యు.సి). రాజకీయ, ఆర్ధిక, సమాజిక, యువత, సంస్థాగత, రైతుల అంశాలపై తీర్మానాలను ఆమోదించనుంది. ఉదయ్ పూర్ ప్రకటనతో 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెసు సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే మద్యాహ్నాం 2.30 గంటలకు కాంగ్రెస్ నేతల సమావేశం జరుగనుండగా.. ఆ తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ఉండనుంది. “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాల ముగింపు ఉపన్యాసం చేయనున్న సోనియా గాంధీ… వందన సమర్పణ చేయనున్నారు రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు గోవింద్ సింగ్.

సాయంత్రం 4.15 గంటలకు జాతీయ గీతం ఆలాపన తో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాలు ముగియనున్నాయి. అయితే.. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ప్రియాంక గాంధీని ఎన్నుకుంటారని సమాచారం అందుతోంది. ఆమె అయితేనే.. పార్టీని నడిపిస్తారని అగ్రనేతలు సోనియాకు చెప్పారట. అయితే.. దీనిపై సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news