కోవిడ్ బాధితుల‌కు హెల్ప్‌లైన్ నంబ‌ర్‌.. కాంగ్రెస్ పార్టీ హ‌లో డాక్ట‌ర్ కార్య‌క్ర‌మం..

దేశ‌వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఓ నూత‌న హెల్ప్ లైన్ సెంట‌ర్‌ను శ‌నివారం ప్రారంభించారు. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌రం అవుతున్నందున కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింద‌ని ఆయ‌న తెలిపారు.

rahul gandhi started hello doctor campaign for covid patients

దేశంలోని ప్ర‌జ‌లు +919983836838 అనే ఫోన్ నంబ‌ర్‌కు కాల్ చేసి కోవిడ్ స‌హాయం పొంద‌వ‌చ్చు. దీనికి హ‌లో డాక్ట‌ర్ అని నామ‌క‌ర‌ణం చేశారు. బాధితులు ఈ నంబ‌ర్‌కు కాల్ చేయ‌డం ద్వారా వైద్య స‌ల‌హాలు, సూచ‌న‌లు, అవ‌స‌ర‌మైన స‌హాయం పొంద‌వ‌చ్చ‌ని రాహుల్ గాంధీ తెలిపారు. ప్ర‌జ‌లు త‌మ‌కు క‌లిగే సందేహాల‌కు స‌మాధాల‌ను తెలుసుకోవ‌చ్చ‌ని అన్నారు.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న డాక్ట‌ర్లు, ఇత‌ర వైద్య సిబ్బంది ముందుకు రావాల‌ని రాహుల్ గాంధీ కోరారు. ఇందులో రిజిస్ట‌ర్ చేసుకుని ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. డాక్ట‌ర్లు ఇందులో రిజిస్ట‌ర్ చేసుకుని తాము అందుబాటులో ఉండే స‌మ‌యాల‌ను తెలియ‌జేస్తే బాధితుల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.