రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కు చంపుతామని బెదిరింపులు

రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేస్ టికాయత్ కు బెదింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామంటూ… తనకు ఎదురువస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ గుర్తు తెలయని వ్యక్తి ఫొన్ లో బెదిరించాడు. కాల్ చేసిన వ్యక్తి రాకేష్ టికాయత్ ను చంపేస్తామంటూ బెదిరించాడు. ఈ ఘటనపై సోమవారం ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్ పై టికాయత్ డ్రైవర్ ప్రవేజ్ త్యాగి ఫిర్యాదు చేశాడు. ముజఫర్ నగర్ లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

రైతు నాయకుడు టికాయత్ ఫిర్యాదు తమకు అందినట్లు ముజఫర్ నగర్ ఎస్పీ అభిషేక్ యాదవ్ ధ్రువీకరించారు. ఈ బెదిరింపు కాల్ ను పరిశీలించేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోమవారం రాకేష్ టికాయత్ ఇంటికి వెళ్లిన పోలీసులు వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో.. కాల్ డిటెయిల్స్, రికార్డులను పోలీసులు సేకరించారు. ఎక్కడ నుంచి ఫోన్ వచ్చిందనే దానిపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసలు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా జరిగిన రైతు ఉద్యమంలో రాకేష్ టికాయత్ కీలకంగా వ్యవహరించారు.